రాయలసీమను ముంచెత్తిన వరదలు..
ఎండలు మండిపోయే మే నెలలో రాయలసీమ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నుండి ఎగతెగకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. అనంతపురంలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీనితో పండమేరు, కొండాపురం తదితర ప్రాంతాలలో వాగులు, వంకలు, ఏర్లు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాలలో ఇళ్లు మునిగిపోయాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.