అక్కడ విమాన సర్వీసులు రద్దు..
భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ దాయాది దేశం ఇంకా దాడులకు యత్నిస్తూనే ఉంది. ఈ పరిణామాల మధ్య దేశీయ విమానయాన సంస్థలు అలర్ట్ అయ్యాయి. పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న సిటీలకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా, ఇండిగో ప్రకటించింది. ‘భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్ము, లేహ్, జోధ్ పుర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ నగరాలకు ఇవాల్టి నుంచి విమాన రాకపోకలు నిలిపివేస్తున్నాం. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. అప్డేట్ లను ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం’ అని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతకుముందు, ఇండిగో కూడా ఇలాంటి ప్రకటనే చేసింది.

