Breaking NewsHome Page SliderInternationalNational

హైద్రాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీస్

రానున్న మార్చి 18 నుంచి హైద్రాబాద్‌ (శంషాబాద్) – వియత్నాం మధ్య విమాన సర్వీస్ అందుబాటులోకి రానున్న‌ట్లు ఎయిర్ పోర్ట్ వ‌ర్గాలు తెలిపాయి. వియట్జెట్ ( vietjet) సంస్థ నడిపే ఈ విమాన సర్వీసులు వారంలో రెండు రోజులు (మంగళ, శనివారం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోచిమన్ సిటీ (వియత్నాం) నుంచి రాత్రి 7.40కు బయల్దేరే ఫ్లైట్ రాత్రి 10.35కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. రాత్రి 11.35కు శంషాబాద్ లో బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు వియత్నాం చేరుతుంది.