పార్క్ చేసిన ఐదు వాహనాలు దగ్దం
హైద్రాబాద్‌లోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసి ఉంచిన 5 బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాల్లో పెట్రోల్ ఉండటంతో మంటలు వ్యాపించిన క్షణాల వ్యవధిలోనే అగ్ని కీలలు ఆకాశానికి అంటేలా ఎగసిపడ్డాయి.దీంతో ఆ సెగ మెట్రో స్టేషన్‌కి తాకింది. ప్రయాణీకులు,స్థానికులు భయంతో పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ నేపథ్యలో దాదాపు 2 కి.మీ.మేర దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించింది.దీంతో మలక్‌పేట్,దిల్‌షుక్ నగర్ మధ్య వాహనరాకపోకలు కొద్ది సేపు నిలిచిపోయాయి. పొగ వల్ల చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా ,ఏదైనా కుట్ర కోణం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు.