ఏలూరు వ్యక్తికి తొలి బర్డ్‌ఫ్లూ కేసు
ఏపీలోని ఏలూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఒక వ్యక్తికి కూడా ఈ వ్యాధి పాజిటివ్ రావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మానవులకు కూడా ఇది వ్యాపించనుండడంతో భయాందోళనలకు గురయ్యారు. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలోని ఒక కోళ్ల ఫామ్ దగ్గరలో ఉండే వ్యక్తికి ఈ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అతనికి నిర్వహించిన టెస్టులలో అతనికి బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఈ వ్యాధి నివారణకు, సోకినవారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆందోళన చెందవద్దని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

