అమృత్‌సర్ స్వర్ణదేవాలయం వద్ద కాల్పుల కలకలం..
అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. అక్కడ అకాల్ తఖ్త్ విధించిన శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం జరిగింది. దుండగుడు తుపాకీతో ప్రవేశించాడు. ఆయనను షూట్ చేయడానికి ప్రయత్నించగా, బాదల్ అనుచరులు అప్రమత్తమై అడ్డుకున్నారు. తుపాకీ గాలిలో పేలడంతో ప్రమాదం తప్పింది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిని నరేన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతను గతంలో మిలిటెంట్‌గా ఉండేవాడని, అతనిపై అనేక కేసులు నమోదయినట్లు గుర్తించారు.