జడ్జి ఇంట్లో ఫైర్..భారీగా బయటపడిన నోట్లకట్టలు..
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా నోట్లకట్టలు బయటపడ్డడం సంచలనం అయ్యింది. హోలీ కోసం కుటుంబంతో సహా సొంతూరుకు వెళ్లిన ఆయన ఇంట్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో భారీగా నోట్లకట్టలు కనిపించాయి. దీనితో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్లకట్టలకి సరైన లెక్కలు కూడా చెప్పలేకపోయారని సమాచారం. దీనితో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు కొలిజియం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు పంపించింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారం వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందనే సీజేఐ నేతృత్వంలోని కొలీజియం అభిప్రాయపడింది.