Home Page SliderNational

బెంగళూరు పబ్‌లో అగ్నిప్రమాదం…భారీ ఎత్తున మంటలు

బెంగళూరులో కోరమంగళ ప్రాంతంలో ఒక ఫేమస్ పబ్‌లో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా నాలుగవ అంతస్తులో పేలుడు సంభవించింది. భవనం పై అంతస్తు నుండి పరిస్థితి భయానకంగా ఉంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి బిల్డింగ్‌లో నాలుగవ అంతస్తు నుండి దూకాడని తెలియజేస్తున్నారు. వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.