అమరేశ్వరుని ఆలయంలో మంటలు
ఆలయంలో మంటలు చెలరేగడంతో హనుమాన్ దివ్యమూర్తి దగ్దమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్ పల్లె గ్రామంలో ఉన్న చారిత్రక శ్రీ అమరేశ్వరుని ఆలయంలో గురువారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే ఉన్న శ్రీహనుమాన్ దివ్య మూలమూర్తి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది.అయితే ప్రమాదమా,కుట్రకోణమా అని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఇది గ్రామానికి అరిష్టమని ఆందోళన పడుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతక ముందే మంటలను నిలువరించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు.
BREAKING NEWS: ములుగు జిల్లాలో మావోల ఘాతుకం