Home Page SliderTelangana

సీఎంను కలవనున్న సినీ ప్రముఖులు

సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు కలవనున్నామని నిర్మాత నాగవంశీ తెలిపారు. హీరో రాం చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు హైదరాబాద్ తిరిగి వచ్చాక సీఎంను కలుస్తామని చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని నాగవంశీ తెలిపారు. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘డాకూ మహారాజ్. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సినిమా డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ మీడియా సమావేశం నిర్వహించారు.