Home Page SliderTelangana

కట్టెకాలే వరకు తెలంగాణ కోసమే పోరాటం: కేసీఆర్

మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మాట్లాడిన కేసీఆర్.. తనను తిట్టడం తప్ప మంత్రులకు, ప్రభుత్వానికి వేరే పని లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పొద్దున లేచిన దగ్గర్నుంచి కేసీఆర్ ను తిట్టడం తప్ప వేరే పని లేకుండా పోయిందని కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఎవరి అధికారం శాశ్వతం కాదని.. తెలంగాణ హక్కులు శాశ్వతమన్నారు కేసీఆర్.. అధికారం ఉన్నా లేకున్నా.. ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. నా ప్రాంతం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే.. ఎక్కడవరకైనా పోరాటం చేయొచ్చన్నారు కేసీఆర్.

పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపాయే అని పాట రాశానన్నారు కేసీఆర్. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు కేసీఆర్.బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తయ్యిందని, డిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందన్నారు. చలో నల్గొండతోనే ఆపేది లేదని.. ప్రజలను కరెంట్ కు తిప్పలు పెట్టినా, నీళ్లకు తిప్పలు పెట్టినా మంచినీళ్లకు తిప్పలు పెట్టినా చూస్తూ ఊరుకోమన్నారు. ప్రజలు మాకు ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత ఇచ్చారన్నారు కేసీఆర్. ప్రజలకు తప్పు చేయొద్దన్నారు. గతంలో బీఆర్ఎస్ ఏవిధంగా ఇచ్చిందో.. ఆ విధంగా రాష్ట్ర మొత్తం కరెంట్ ఇవ్వాలన్నారు.