కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా 63వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పండ్ల సరుకుతో వెళ్తున్న లారీ.. టిప్పర్ ని అదుపు తప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. యలపుర మండలం, గులపుర గ్రామ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీల్లోని డ్రైవర్లు,క్లీనర్లు సహా వాహనాల ముందు వెళ్తున్న బైకిస్టులు,పాదచారులు సహా మొత్తం 9 మంది మృత్యువాత పడ్డారు. డ్రైవర్‌లు నిద్ర మత్తులో ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.ప్రమాద సమయంలో లారీ పై ఉన్న పండ్ల బస్తాలు ఎగిరి కిందకు పడటంతో అటుగా నడుచుకుంటూ వెళ్లిన వారిపై పడి వారు కూడా దుర్మరణం చెందారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ని క్రమబద్దీకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

