ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 20 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి.వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు మల్లేష్, సందీప్, బాలమణి, హేమలతగా పోలీసులు గుర్తించారు.