Home Page SliderTelangana

ఘోర రోడ్డు ప్రమాదం..20మందికి గాయాలు, డ్రైవర్ మృతి

BVRIT కళాశాలకు చెందిన రెండుబస్సులు ఒకదానికెదురుగా మరొకటి ఢీ కొట్టిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఈ ఘోర ప్రమాదం నర్సాపూర్ సమీపంలో జరిగింది. నర్సాపూర్‌లో ఉన్న BVRIT కళాశాల బస్సులు పట్టణ శివారులోని క్లాసిక్ గార్డెన్ వద్ద వేగంగా వెళ్తూ ఢీకొట్టాయి. ఈ క్రమంలో ఇద్దరూ డ్రైవర్లు తీవ్రంగా గాయపడగా వారిలో డ్రైవర్ నాగరాజు (50) మృతి చెందారు. విద్యార్థులలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ భారీగా జామయ్యింది. నర్సాపూర్-సంగారెడ్డి మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు క్రమబద్దీకరించే చర్యలు చేపట్టారు.