ఫాం హౌజ్లో కోడిపందేలు…పేకాట…క్యాసినో
పేకాట,క్యాసినో,కోడి పందేలు…ఈ మూడు భిన్న సంస్కృతులకు చెందిన జూదాలు. ఒకటి నిత్యం జరిగేది,మరొకటి ఏడాదికొకసారి జరిగేది, ఇంకొకటి చీకట్లో జరిగేది.అయితే ఇప్పుడు ఈ మూడు జూదాలను ఒకే చోటకు తెచ్చి ప్రజల ఇళ్లు ఒళ్లు గుల్ల చేస్తున్న ఓ ముఠాని చాకచక్యంగా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు పోలీస్ లు.హైదరాబాద్ శివారులోని ఫాం హౌస్లో కోడి పందేలు, భారీ ఎత్తున క్యాసినో నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు.రాజేంద్రనగర్ డిసిపి పార్టీ.. ఫామ్ హౌస్ పై దాడి చేసి 64 మందిని పట్టుకున్నారు .దాదాపు 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేశారు.86 పందెం కోళ్ళు.. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ స్వాదీనం చేసుకుని పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం గమనార్హం.నగరంలోని ప్రముఖులు కలిసి కోడిపందాలు క్యాసినో నిర్వహిస్తున్న వ్యక్తి భూపతిరాజు శివకుమార్ వర్మగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

