Andhra PradeshNews

వర్షంలోనూ కదలని అభిమానం

◆ పులకించిన చిరంజీవి
◆ గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు పోటెత్తిన అభిమానం
◆ 50 వేల మందికి పైగా వచ్చుంటారని పోలీసుల అంచనా
◆ సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమం విజయవంతం

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు అనంత అభిమానం చాటుకున్నారు. బుధవారం రాత్రి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ఈ వేడుకకు జనం పోటెత్తారు. పిల్లా, పాప యువత వృద్ధులు అని తేడా లేకుండా వేలాదిమంది ఆర్ట్స్ కళాశాల మైదానానికి తరలి వెళ్లారు. వచ్చిన అభిమానులను చూసి చిరంజీవి పులకించిపోయారు. వాస్తవంగా ముప్పై వేల మందికి కెపాసిటీ ఉన్న ఆ మైదానంలో కనీసం యాభై వేల మందికి పైగా వచ్చి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. పాసులు పెద్ద సంఖ్యలో పంపిణీ చేయడంతో పోటాపోటీగా అభిమానులు తరలి వచ్చారు. ముంబై ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన డ్యాన్సర్లు తమ ఆటపాటలతో అలరించారు. సినిమాలో నటించిన వారంతా వేదిక మీద కనపడి అభిమానులకు కనువిందు చేశారు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విజయవంతం కావాలని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతపురం నుంచి కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఈ కార్యక్రమానికి రావటంతో నగరం పూర్తిగా అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఉరుములు మెరుపులు పిడుగుపాటుతో భారీ వర్షం కురిసినప్పటికీ అభిమానులు కదల్లేదు. గాడ్ ఫాదర్ లేకుండా వచ్చాను సినిమా పరిశ్రమలో నిలదొక్కుకున్నానని జనమే తనకి గాడ్ ఫాదర్ లు అని వారి ఆశీస్సులతో ఇంతటి వాడినయ్యానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అక్టోబర్ 5న సినిమా రిలీజ్ అవుతుందని సినిమాను అందరూ ఆదరించాలని చిరంజీవి అభ్యర్థించారు. భారీ వర్షం లోను తడుచుకుంటూ చిరంజీవి తన ప్రసంగాన్ని కొనసాగించారు.