నా సినిమా షూటింగ్‌కు ఎక్స్‌పీరియం పార్క్..చిరంజీవి
రంగారెడ్డి జిల్లాలోని ప్రొద్దుటూరులో 150 ఎకరాలలో నిర్మించిన ఎక్స్‌పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి అద్భుత కళాఖండంగా అభివర్ణించారు. ఈ పార్క్‌ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ థీమ్ పార్క్ హైదరాబాద్‌కు ల్యాండ్ మార్క్‌గా మారబోతోందన్నారు. దీనివల్ల నగరంలో టూరిజం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే ఈ పార్క్ అథినేత రాందేవ్‌ను షూటింగ్ కోసం ఈ పార్క్‌ను ఇస్తారా అంటూ అడిగితే, ఆయన సరదాగా చిరంజీవి షూటింగ్ అయితే ఇస్తానని పేర్కొన్నారు. ఈ పార్క్ అందాన్ని చూసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను ఎంతో ఆశ్చర్యపోయామని పేర్కొన్నారు.

