వైకల్యం కూడా అతని పట్టుదలకు తలొగ్గింది
నేటి సమాజంలో యువత చిన్న చిన్న సమస్యలకే భయపడుతూ..తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారంగా భావిస్తున్నారు. ఇలాంటి రోజుల్లో తన శరీరంలో 76% వైకల్యం ఉన్నప్పటికీ మారథాన్ పూర్తి చేసి ఓ వ్యక్తి రికార్డు సృష్టించారు. స్పెయిన్‌లోని కాటలోనియాలో జరిగిన బార్సిలోనా మారథాన్‌లో 32 ఏళ్ల అలెక్స్ రోకా అనే అథ్లెట్ అరుదైన ఘనత సాధించాడు. తన శరీరంలో పక్షవాతం కారణంగా 76% వైకల్యం ఉన్నప్పటికీ 42 కిలోమీటర్ల మారథాన్‌ను 5 గంటల 50 నిమిషాల 51 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో ప్రపంచంలో 76% వైకల్యంతో మారథాన్‌ను పూర్తి చేసిన మొదటి అథ్లెట్‌గా నిలిచాడు. కాగా ఆయన పూర్తి చేసిన బార్సిలోనా మారథాన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

