విచారణకు ఈటల హాజరవుతారు..
కాళేశ్వరం కమిషన్ విచారణకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరవుతారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు తెలిపారు. గతేడాది రావాల్సిన కాళేశ్వరం రిపోర్ట్ ఏడాది ఆలస్యమైందని.. ప్రజల దృష్టి మరల్చడానికే మరోసారి గడువు పొడిగించారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హరీశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం టైం పాస్ చేస్తోంది. 22న జ్యుడిషియల్ రిపోర్ట్ వస్తుందని లీక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు రెండు నెలలు విచారణ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్కార్ కే క్లారిటీ లేదు. విచారణకు బీజేపీ పూర్తి స్థాయిలో సహకరిస్తది. కాళేశ్వరం ప్రాజెక్ట్ దోషులను శిక్షించాలి. బీఆర్ఎస్ నేతలు ఏం చెప్పిన ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు’ అని అన్నారు.

