InternationalNews

ఇల్లు లేక గ్యారేజీలో నిద్రించిన ప్రపంచ కుబేరుడి తల్లి

ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈఓ అయిన ఎలాన్‌ మస్క్‌ తల్లి మయే మస్క్‌(74) ఇటీవల ఓ రోజు గ్యారేజీలో నిద్రించారు. అది కూడా ఎలాన్ మస్క్ ఇంటిని సందర్శించడానికి టేక్సాస్ వెళ్లినప్పుడు కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ‘ద సండే టైమ్స్‌’ పత్రికతో పంచుకున్నారు. అమెరికాలోని టెక్సాస్‌‌లో ఎలాన్‌ మస్క్‌ను కలిసేందుకు స్పేస్‌ ఎక్స్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని.. అక్కడికి సమీపంలో ఇల్లేమీ లేదని.. అందుకే ఒక గ్యారేజీలో నిద్రించానని తెలిపారు. మస్క్‌లా తనకు అంగారక గ్రహంపైకి వెళ్లాలన్న కోరిక లేదన్నారు.


తనకు సొంత ఇల్లు లేదని ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. “మొత్తం ఆస్తులను అమ్మేశాను. సొంత ఇల్లు కూడా లేదు. డబ్బు అవసరం లేదు. ఆస్తులు భారాన్ని పెంచుతాయి. ప్రస్తుతం స్పేస్ఎక్స్ నుంచి ఇల్లు అద్దెకు తీసుకున్నాను. దాని విలువ 50,000 డాలర్లు ” అని తన ట్విటర్‌లో పేర్కొన్నారు. 2020లో తన మొత్తం అస్తులను విక్రయిస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు.