ఇకపై రేషన్ షాపులో కోడిగుడ్లు..
తెలంగాణ ప్రభుత్వం ఇకపై రేషన్ షాపుల్లో ఉచితంగా కోడి గుడ్లు పంపిణీ చేయాలని నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ కోరింది. బియ్యం, కందిపప్పు, చక్కెరలతో పాటు కోడి గుడ్లు కూడా పంపిణీ చేస్తే మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు పోషకాహార లోపానికి గురి కాకుండా ఉంటారని పేర్కొన్నారు. ఈ గుడ్ల పోషకాహార విలువలను వివరిస్తూ ప్రత్యేక క్యాలెండర్‌ను మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో కౌన్సిల్ అధ్యక్షుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి 6 గుడ్లు, అంగన్ వాడీలలో గర్భిణులకు రోజుకు 2 గుడ్లు, పనికి ఆహారపథకంలో పనిచేస్తున్న వారికి నెలకు 30 గుడ్లు ఇస్తున్నారని, అలాగే రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు నెలకు 30 గుడ్లు అందిస్తే ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఉచితంగా ఇస్తారా? సబ్సిడీతో ఇస్తారా? అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

