జమ్మూ కశ్మీర్‌లో అలజడి సృష్టించిన భూకంపం
జమ్మూకశ్మీర్‌లో భూకంపం అలజడి సృష్టించింది. కాగా జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇవాళ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. కాగా దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. మరోవైపు లద్ధాఖ్‌లోని లేహ్‌లోను 3.6 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.