తెలంగాణాలో రూ.1.51లక్షల డ్రగ్స్ సీజ్
తెలంగాణలోని సంగారెడ్డి,ఆదిలాబాద్ జిల్లాల్లో లైసెన్స్ లు లేని మెడికల్ షాప్‌లలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన నిషిద్ద ఔషదాలను అధికారులు సీజ్ చేశారు. 54 రకాల యాంటీ హైపర్ టెన్సివ్ మెడిసిన్ అదేవిధంగా వివిధ రకాల స్టెరాయిడ్స్,యాంటీ డయాబెటిక్ మందులను అక్రమంగా నిల్వ ఉంచారని వాటికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు నిర్ధారణకు వచ్చాక సీజ్ చేశారు. నిషిద్ద ఉత్ప్రేరకాలను కలిగి ఉన్న విక్రయించినా నేరమని అధికారులు హెచ్చరించారు. సీజ్ చేసిన షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.