పాతబస్తీలో డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి.హైదరాబాద్ పోలీసులు,అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా డ్రగ్స్ సరఫరా, వాడకాన్ని అరికట్టలేక పోతున్నారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్‌లోని పాతబస్తీలో పోలీసులు ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న సయ్యద్ దంపతులను అరెస్ట్ చేశారు. కాగా సయ్యద్ దంపతులతోపాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరంతా బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సయ్యద్ దంపతులు గత నాలుగేళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా గత 3 నెలల్లో వీరు 19మంది ప్రముఖులకు డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే డ్రగ్స్ విక్రయిస్తున్న కేసులో సయ్యద్ దంపతులను పోలీసులు గతంలోనూ అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ వీరు ఎవరికీ భయపడకుండా డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.