చూస్తూ ఆగలేకపోయాం.. ప్రాణం పోయినంత పనయ్యింది..
ఇష్టమైన బ్రాండ్లు అన్ని ఒక్కసారిగా రోడ్డు మీద కనిపిస్తే మందుబాబులకు పెద్ద పండగే. గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పలు కేసుల్లో పట్టుబడిన రూ.50లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు ఏటూకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్ లో ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు యువకులు, మందుబాబులు పోలీసుల ముందే మందు బాటిళ్లను అందినకాడికి ఎత్తుకెళ్లి పరుగులు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.