Breaking NewscrimeHome Page SliderLifestyle

ఒక్క‌సారిగా ప‌డిపోయిన ప‌గ‌టిపూట ఉష్ణోగ్ర‌త‌లు

ఈ సీజ‌న్‌లో పెద్ద‌గా చ‌లి లేదు…లేదు అని అనుకుటుండ‌గానే ప‌గ‌టి పూట ఉష్షోగ్ర‌త‌లు ప‌తాక స్థాయిలో ప‌డిపోయాయి. జ‌మ్మూ కాశ్మీర్ లో మైన‌స్ 12 డిగ్రీల‌కు ప‌డిపోయాయి.ఇదే ఈ సీజ‌న్ లో అత్యంత క‌నిష్టం కాగా…ఏపి,తెలంగాణాలో ఆదివారం నుంచి చలిపులి పంజా విసిరింది.ఈ మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే 8 డిగ్రీల మేర ఉష్ణోగ‌త్ర‌లు క‌నిష్టానికి ప‌డిపోవ‌డంతో ప్ర‌జ‌లు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న చ‌లి గాలులతో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్‌, మెదక్‌ జిల్లా సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత అంతకంతకూ పెరిగింది. 11 నుంచి 12 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చచలితీవ్రతకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వణికిపోతోంది. నాలుగురోజుల కిందట 15 డిగ్రీలపైబడి నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు తాజాగా 5.2 డిగ్రీలకు పడిపోవటంతో జనం గజగజ వణకాల్సి వస్తోంది. జైనథ్‌, భోరజ్‌, సోనాల, తాంసి, తలమడుగు, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లా తాండ్ర, మంచిర్యాల జిల్లా కాసిపేట ప్రాంతాల్లో 6 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.