అబద్దాలు ప్రచారం చేయకండి.. చిల్లర వేషాలు ఆపండి..
బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభల్లో బీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు వేస్తున్నారని, ఇకనైనా వాటిని ఆపాలన్నారు. ఇవాళ ఆమె వరంగల్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ పథకాలపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారులను ఆందోళనకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతూ… అలా చేయడం కరెక్ట్ కాదని సూచించారు. రాష్ట్రంలో ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని, ఆ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని సీతక్క తెలిపారు.