ప్రిన్స్‌హ్యారీకి బ్రిటన్ రాజకుటుంబం పక్కన చోటుందా?
బ్రిటన్ రాజుగా పట్టాభిషేకానికి సిద్ధమవుతున్నారు ప్రిన్స్ చార్లెస్-3. మే 6న ఈ మహారాజపట్టాభిషేకం అంగరంగవైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి రాజకుటుంబానికి దూరమైన చిన్నకుమారుడు ప్రిన్స్ హ్యారీ వస్తున్నాడా లేదా అనేది ఆసక్తరంగా మారింది. దీనికి హ్యారీ తాను తండ్రికోరిక మేరకే వస్తున్నా అంటూ జవాబిచ్చారు. అయితే ఆయనకు రాచమర్యాదలు జరగకపోవచ్చని తెలుస్తోంది. చాలాకాలం క్రితమే రాచరిక విధులను వదులుకొని అమెరికాలో స్థిరపడిన ఆయన ఈ కార్యక్రమంలో రాజకుటుంబంతో కాకుండా 10 వరుసల అవతల సామాన్య ప్రజలవలే సభలో కూర్చునే అవకాశాలున్నాయి. క్వీన్ ఎలిజబెత్ మరణానంతరం ఛార్లెస్ కింగ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే సంప్రదాయంగా నిర్వహించబడే పట్టాభిషేకం జరగలేదు. ఈ వేడుక లండన్‌లోని ‘వెస్ట్ మినిస్టర్ అబే’లో జరుగబోతోంది. ఇటీవల ప్రిన్స్ హ్యారీ వ్రాసిన ‘స్పేస్’ అనే పుస్తకం రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించింది. హాలీవుడ్ నటి అయిన మేఘన్, ‘డచెస్ ఆఫ్ సుసెక్స్’ను వివాహం చేసుకుని రాజకుటుంబానికి దూరమయ్యారు ప్రిన్స్ హ్యారీ.

