Home Page SliderTelangana

సినిమాలు ఎక్కువగా చూస్తావా.. డైలాగులు చెప్తున్నావ్..

ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ చేసుకుంటే నొప్పి రాదా.. గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా? అంటూ గర్బిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు టార్చర్ పెడుతున్నారు. ఈ తతంగం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలోనిది. సినిమాలు ఎక్కువగా చూస్తావా.. డైలాగులు చెప్తున్నావంటూ.. గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా వైద్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరో వైపు డెలివరీ చేయడానికి సిబ్బంది లంచాలు కూడా అడుగుతున్నారంటూ మీడియా ముందు ఓ బాలింత తన బాధను చెప్పుకొచ్చింది. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కాన్పు అయ్యాక బిడ్డను పక్కన పడేసారు.. ఆ తర్వాత ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు.. రిజిస్టర్ లో మా పేర్లు కూడా తప్పుగా రాశారంటూ, పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని బాలింత ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నామని గర్భిణీలు వేడుకుంటున్నారు.