మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నా
మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి దిశలో ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని.. రిటర్నింగ్ అధికారి నిబధనలు పాటించలేదని ఆరోపించారు. తనను, తమ బీజేపీ నేతలను ప్రచారం కూడా చేసుకోనీయకుండా పోలీసులతో కట్టడి చేశారన్నారు. 31వ తేదీ వరకు ధర్మ యుద్ధం నడించిందని.. ఒకటో తేదీ నుంచి టీఆర్‌ఎస్, పోలీసులు అధర్మ యుద్ధానికి పాల్పడ్డారని ఆవేదన చెందారు. డబ్బులు, మద్యం పంచి టీఆర్‌ఎస్ వాళ్లు ప్రలోభాలకు గురి చేశారన్నారు. టీఆర్‌ఎస్ అవినీతి సొమ్ముకు కమ్యూనిస్టులు కూడా అమ్ముడుపోయారన్నారు. అభ్యర్థిగా తనను కూడా ప్రచారం చేసుకోనీయలేదన్నారు. ఒక్కడిని ఓడించేందుకు టీఆర్‌ఎస్ కౌరవ సైన్యాన్ని దించిందని.. వారిది అధర్మ గెలుపు అన్నారు. తనను నమ్మి చాలా మంది బీజేపీలో చేరారని.. కేసీఆర్ భయపడినప్పుడే ఓడిపోయారని పేర్కొన్నారు.

