రైల్వే టిక్కెట్ ధరలో రాయితీ ఎంతో తెలుసా ?
ప్రతీ రైల్వే టిక్కెట్‌పై భారతీయ రైల్వే 46 శాతం రాయితీ ఇస్తోందట. రూ.100 విలువ గల టిక్కెట్‌లో రూ.54 మనం ఖర్చు పెడితే, రూ.46 కేంద్రప్రభుత్వం ఖర్చు పెడుతోందని, తాజాగా పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ రాయితీ అన్ని రకాల టిక్కెట్లపై కొనసాగుతోందన్నారు. ఏడాదికి రూ.57 వేల కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించారు. ఇటీవల భుజ్, అహ్మదాబాద్‌ల మధ్య నమో భారత్ రైలు సేవలు ప్రారంభించామని వీటి మధ్య దూరం 359 కిలోమీటర్లు కాగా, కేవలం 5 గంటల 45 నిమిషాలలో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని తెలిపారు. భారతీయ రైల్వే అందిస్తున్న సేవలపై దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

