మకడమియ గింజల గురించి మీకు తెలుసా?
ఆరోగ్యదాయకమైన అనేక పోషకాలతో కూడి ఉండే మకడమియ గింజలు తియ్యగా, కమ్మని రుచిని కలిగి ఉంటాయి. మకడమియ గింజలు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ తగ్గిస్తాయి. ఊబకాయాన్ని తగ్గిస్తాయి. జీర్ణ శక్తిని పెంచుతాయి. కేన్సర్ నిరోధక శక్తి నిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మానసిక ఒత్తిడి నుంచి ఇన్ ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రక్తహీనత రాకుండా చూస్తాయి. ఆ మధుమేహం రాకుండా చూస్తాయి. మోనో అన్ శాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్లు ఉంటాయి. వంద గ్రాముల గింజలు 718 కేలరీల శక్తి నిస్తాయి. గింజలకే కాదు దాని పైన పొరలో కూడా అధిక కేలరీలను ఇచ్చే శక్తి ఉంది.
ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఇందులో ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 8.6 గ్రాములు రోజుకు మనిషికి కావాల్సిన 23% డైటరీ ఫైబర్ ఉంది. బి-సిటోస్టెరాల్ వంటి ఫైటోస్టెరాల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఓలిక్ ఆసిడ్ (18:1), పాల్మిటోలిక్ ఆసిడ్ (16:1) వంటి మోనో అన్ శాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీసు, జింగ్, సెలీనియం వంటి ఎంతో ఉపయోగకరమైన మినరల్స్ ఉన్నాయి. ఇంకా.. జీవక్రియలకు దోహదపడే బి-కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 15% నియాసిన్, 21% పైరిడాక్సిన్ (విటమిన్ బి-6), 100% థయామిన్, 12% రిబోఫ్లావిన్ వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉన్నాయి. ఆక్సిజన్ – ఫ్రీ రాడికల్స్ కలిగించే నష్టం నుంచి డిఎన్ఎను, కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు మకడమియ గింజల్లో పుష్కలంగా ఉన్నాయి.