అప్పటి వరకు కేటిఆర్‌ని అరెస్ట్ చేయొద్దు
ఫార్ములా – ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటిఆర్‌కు అరెస్టు నుంచి ఊరట లభించింది. నిన్న మొన్నటి వరకు తనను దమ్ముంటే అరెస్ట్ చేయాలని సవాల్ విసిరిన కేటిఆర్…రేవంత్ ప్రభుత్వం ఏసిబి చేత శుక్రవారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించగానే హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసి క్వాష్ చేయాలని కోరారు.దీంతో హైకోర్టు పూర్వాపరాలను పరిశీలించి ఈనెల 30 వరకు కేటిఆర్ ని అరెస్ట్ చేయొద్దని ఏసిబికి ఆదేశాలిచ్చింది.దీనిపై ఈనెల 27కు విచారణను వాయిదా వేసింది.అయితే ఏసిబి తన విచారణను నిరభ్యంతరంగా సాగించవచ్చిన సూచించింది.దీంతో కేటిఆర్‌కు ఊరట లబించినట్లైంది.