Breaking NewscrimeHome Page SliderNewsTelangana

పోలీసుల తీరుపై డికే అరుణ మండిపాటు

ల‌గ‌చ‌ర్ల బాధితుల‌ను ప‌రామ‌ర్శ‌కు బ‌య‌లుదేరిన బీజెపి ఎంపి డికే అరుణ‌ను పోలీసులు అడ్డ‌గించ‌డం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.అంతే కాదు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించేందుకు బ‌య‌లుదేరినా పోలీసులు నిలువ‌రించ‌డ‌మేంటంటూ ప్ర‌శ్నిస్తున్నారు.ఇది త‌న హ‌క్కుల‌ను కాల‌రాయ‌డ‌మే అవుంద‌న్నారు. ప్ర‌జాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా నియంతృత్వ దేశంలో ఉన్నామా అంటూ పోలీసుల‌పై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాధితుల‌కు న్యాయం చేయ‌క‌పోగా రైతుల‌ను అరెస్ట్ చేస్తున్నార‌ని,రేవంత్ స‌ర్కార్ త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని ఆమె హెచ్చ‌రించారు.