Home Page SliderTelangana

పార్టీ మార్పు ప్రచారంపై మీడియా తీరును ప్రశ్నించిన డీకే అరుణ

తాను పార్డీ మారుతానంటూ ప్రచారం చేస్తున్నవారికి గూబగుయ్యమనేలా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఏదైనా ఉంటే తనను సంప్రదించి మీడియాలో రాయాలి కానీ.. ఎలాంటి సమాచారం లేకుండా వార్తలు ఇష్టానుసారం రాయడం దారుణమన్నారు. తాను ఏనాడు అధికారం కోసం వెంపర్లాడలేదన్నారు అరుణ. మీడియా కథనాలపై ఆమె వీడియో రిలీజ్ చేశారు.

డీకే అరుణ కాంగ్రెస్‌లోకి వెళ్తుందని కాంగ్రెసోళ్లు రాతలు రాయిస్తున్నారు
పదవుల కోసమో, ఆశపడో పార్టీ మారేది డీకే అరుణ కాదు.. ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తోంది అరుణ
పలానా చోటుకు వెళ్తే గెలుస్తానన్న ఆలోచన లేదు. బుద్ధి లేదు.
కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చితే చేసుకోండి. అంతే కానీ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయొద్దు
ఎంతో కష్టపడి సంపాదించుకున్న రాజకీయ విలువలను డామేజ్ చేసే అధికారం ఎవరికీ లేదు
వార్తలు రాసే ముందు అడిగే బాధ్యత అడిగేవాళ్లకు ఉండాలి
వేసే పత్రికకు ఉండాలి
మీడియాను హెచ్చరిస్తున్నా.. నాపై వార్త రాసేటప్పుడు నాతో సంప్రదించి రాయండి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్.