దీపావళి వేడుకల్లో అపశృతి.. కంటి ఆస్పత్రిలో చేరిన 50 మంది
దీపావళి పండుగ రోజున తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అపశృతి చోటు చేసుకుంది. టపాసులు కాలుస్తుండగా పలువురి కంటికి గాయాలయ్యాయి. దీంతో బాధితులు హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. అక్టోబర్ 31 రాత్రి నుంచి నవంబర్ 1 ఉదయం వరకు దాదాపు 50 మంది ఆస్పత్రిలో చేరారు. 40 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.


 
							 
							