Home Page SliderTelangana

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయండి : హైకోర్టు

బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను 15 రోజుల్లోగా కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ ఆఫీస్ రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీ ఆఫీస్ కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని.. విచారణలో భాగంగా హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు పిటిషనర్ ను అడిగింది. పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం చట్టాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొంది. 15 రోజుల్లో పార్టీ ఆఫీస్ ను కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. లక్ష రూపాయల నష్ట పరిహారం బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆగస్టు 11 లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు డెడ్ లైన్ పెట్టారు. కానీ నెల రోజులు అవుతున్నా పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చలేదు. పార్టీ కార్యాలయాన్ని టచ్ చేస్తే అంతు చూస్తామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సైతం వార్నింగ్ ఇచ్చారు. చివరకు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు ఆశ్రయించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసేలా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది.