Home Page SliderNational

10 వేల నోటు ఉండేదని మీకు తెలుసా?

మన దేశంలో కరెన్సీ నోట్లు మారుతూనే ఉన్నాయి. గతంలో10 వేల రూపాయల నోటు ఐదు వేల రూపాయల నోటు ఉండేవి. ఆ రోజుల్లో ఇలాంటివి పది నోట్ల కాగితాలు మీ జేబులో ఉంటే లక్ష రూపాయలు ఉన్నట్టు అనుకునేవారు. 1938లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 10 వేల రూపాయల నోటును ప్రవేశ పెట్టింది. ధనికులు ఈ నోటును వాడేవారు. అయితే దీని వల్ల బ్లాక్ మనీ లావాదేవీలు పెరుగుతున్నాయని 1946లో రద్దు చేశారు. అయితే 1954లో మళ్లీ ఈ పదివేల నోటు మన దేశంలో చెలామణిలోకి వచ్చింది. పాత సినిమాల్లో వెడల్పుగా ఉండే నోట్ల కట్టలు కనిపించేవి. వాటిని మనం పదివేల రూపాయల నోట్ల కట్టలు అనుకోవచ్చు. కాని మన ప్రధానిగా మురార్జీ దేశాయ్ ఉన్నప్పుడు 1978లో ఈ నోటును రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ రాలేదు.