రజనీకాంత్‌ను తిట్టిన మాజీ మంత్రులు ఓడిపోయారా…
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ విషయం రజనీకాంత్‌కు చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన రజనీకాంత్‌తో ఆయన మాట్లాడుతూ గతంలో మిమ్మల్ని తిట్టిన వైసీపీ మంత్రులంతా ఇప్పుడు ఓడిపోయారని చెప్పారు. దీనికి రజనీకాంత్ మనకు నచ్చింది మనం మాట్లాడుతాం దానికే తిట్టకూడదు కదా అన్నారు. జనసేనలో చేరడం మంచి పని అని బాలశౌరిని అభినందించారు. పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు అవుతాడని ప్రశంసించారు రజనీకాంత్. గతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంలో బాలకృష్ణ ఆహ్వానంపై వచ్చిన రజనీకాంత్ చంద్రబాబును ప్రశంసించడంతో తట్టుకోలేని వైసీపీ మంత్రులు పేర్ని నాని, రోజా, కొడాలి నాని రజనీకాంత్‌ను దుయ్యబట్టారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన లేదని రోజా అన్నారు. రజనీకాంత్ పార్టీ పెట్టినట్టే పెట్టి ఎన్నికలలో పోటీ చేయడానికి భయపడ్డాడని కొడాలినాని విమర్శించారు.