వంశీ అరెస్ట్ …జగన్‌కి ముందే తెలుసా?
ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపి కార్యకర్తల సమావేశంలో బుధవారం పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాడర్‌ని గట్టిగా హెచ్చరించారు.త్వరలో మరికొన్ని అబద్దపు కేసులు పెట్టి,అక్రమంగా అరెస్ట్ చేయబోతున్నారని చెప్పారు.జగన్ చెప్పి 24గంటలు గడవక ముందే వంశీని అరెస్ట్ చేశారు. పార్టీ నాయకులపై అక్రమ కేసులు ఉండబోతున్నాయని,వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని జగన్ నిన్ననే చెప్పారు. దీన్ని బట్టి జగన్ నిఘా వ్యవస్థ అత్యంత పటిష్టంగా పనిచేస్తున్నట్లు అర్ధమౌతుంది. సంఘర్షణను ఎదుర్కొనే నాయకుడుకి, సైన్యాన్ని నడిపించుకునే అధ్యక్షుడికి ఈ మాత్రం ముందు చూపు ఉండకపోతే అధికార పక్షాన్ని ఎదుర్కోవడం అసాధ్యం.రానున్న ఉపద్రవాన్ని అంచనా వేయడంలో జగన్ కి జగనే సాటి అని ఈ విషయంతో రుజువు అయ్యింది.