ధరణి స్థానంలో భూ భారతి..
ధరణితో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మేం భేషజాలకు పోయి రద్దు చేయడం లేదు. దానిని బంగాళా ఖాతంలో వేస్తున్నాం. దాని స్థానంలో భూభారతి బిల్లును ప్రవేశపెడుతున్నాం అని శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. “రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో ఈ విషయంలో చర్చ కూడా నిర్వహించాం. ముసాయిదా బిల్లును 40 రోజులు వెబ్‌సైట్‌లో ఉంచాం. ఎమ్మెల్యేలు, మేధావులు ఇచ్చిన అంశాలను డ్రాఫ్ట్‌లో పెట్టాం. 18 రాష్ట్రాలలో ఆర్‌ఓఆర్ చట్టాలను పరిశీలించి భూభారతి తీసుకొచ్చాం. ప్రతీ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తాం అని పొంగులేటి పేర్కొన్నారు. 33 మాడ్యూల్స్‌లో ఉన్న దాన్ని 6 మాడ్యూల్స్‌తో పునఃప్రక్షాళన చేస్తున్నాం” అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల 4 నెలలుగా రిజిస్ట్రేషన్లు జరగలేదని పేర్కొన్నారు.