భార్య చేతిలో డీజీపీ హత్య..వెలుగులో సంచలన విషయాలు
కర్ణాటకకు చెందిన మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ తన భార్య పల్లవి చేతిలోనే హత్యకు గురి కావడం సంచలనం కలిగించింది. ఈ ఘటనలో పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనపై హత్యకు ముందు కారం చల్లి, కట్టేసిందని, ఆపై గాజు బాటిల్‌తో దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. ఆపై రెండు కత్తులతో పొడిచినట్లు పేర్కొన్నారు. ఆమె భర్తను హత్య చేసిన విషయాన్ని మరో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ భార్యతో చెప్పినట్లు తెలిసింది. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాల కారణంగా హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.