భోలే బాబాకే మద్దతు తెలుపుతున్న వీరభక్తులు
‘ఎవరి పిచ్చి వారికానందం’ అనే సామెత గుర్తొస్తుంది హాధ్రస్ ఘటన గురించి తెలిసిన వారికి. విచిత్రమేమంటే హాధ్రస్‌లో 121 మంది భక్తుల మరణానికి కారణమయిన భోలే బాబాకే ఇంకా ఆయన వీర భక్తులు మద్దతు తెలుపుతున్నారు. భోలే బాబా దేవుడంటూ, అంతా ఆయనకు ముందే తెలుసంటున్నారు. ఆయనను టార్గెట్ చేసి కించపరచవద్దంటూ సోషల్ మీడియాలలో పోస్టులు పెడుతున్నారు. ఆయన చేసిన అద్భుతాలను తాము స్వయంగా చూసామని, ఆయనను ఈ ఘటనకు బాధ్యునిగా చూడవద్దని కోరుతున్నారు. ఆయన ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయిన తర్వాతే ఈ తొక్కిసలాట జరిగిందని వారు పేర్కొన్నారు. బాబా వెళుతుంటే ఆయన కాళ్ల కింద మట్టి కోసం జరిగిన తొక్కిసలాటలో 121 మహిళలు, పిల్లలు సహా మరణించిన సంగతి తెలిసిందే. గాయపడిన వారితో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. చనిపోయిన కుటుంబసభ్యుల కోసం వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఈ సంఘటన జరిగినప్పటినుండి బాబా పరారీలో ఉన్నారు.