Home Page SliderTelangana

ఈటలను కలిసిన యూపీ డిప్యూటీ సీఎం

తెలంగాణా బీజేపీనేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఐన ఈటల రాజేందర్‌ను ఆయన శామీర్ పేట నివాసంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ కలిశారు. ఈ భేటీకి ప్రత్యేక కారణాలు లేవని, మర్యాదపూర్వకంగానే కలిసారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఇటీవల ఈటల దిల్లీ పర్యటనకు, ఈ భేటీకి ఏదైనా సంబంధం ఉందేమో అని మీడియావర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈమధ్య కాలంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు ఈటల రాజేందర్ గైర్హాజరయ్యారు. దీనితో రాష్ట్రబీజేపీలో వర్గాలు ఏర్పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రిజేష్ పాఠక్ ఈటలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.