విజృంభిస్తున్న డెంగ్యూ
రాష్ట్రంలో డెంగ్యూ కేసులు సంఖ్య పెరుగుతూపోతోంది. ప్రభుత్వ , ప్రవేటు ఆసుపత్రి అనే తేడా లేకుండా బెడ్స్ అన్ని ఫుల్ అవుతున్నట్టు సమాచారం. దీంతో డెంగ్యూ కేసులు గుర్తించేందుకు ప్రభుత్వం ఫీవర్ సర్వేను ప్రారంభించనున్నట్టు తెలిసింది. అయితే ఈ డెంగ్యూ ఫీవర్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందిరిని ఇబ్బందులుకు గురిచేస్తోందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రుల్లో 40% బెడ్స్ డెంగ్యూ బారిన పడిన వారితో నిండిపోయునట్టు పేర్కొన్నారు. దీని బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రతీ ఏరియాలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.