కర్నాటకలో యూసుఫ్‌గూడ వాసుల దుర్మరణం
హైద్రాబాద్‌లోని యూసుఫ్ గూడ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శనివారం తెల్లవారుఝామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వారంతతా అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కర్నాటకలోని కలబురగి జిల్లా కమలాపూర్ రహదారి సమీపంలో కారులో ప్రయాణిస్తుండగా బొలేరో వాహనం అదుపు తప్పి ఢీకొట్టింది.దీంతో కారు పల్టీలు కొట్టి నుజ్జు నుజ్జు అయ్యింది. ఇందులో ప్రయాణిస్తున్న వారిలో భార్గవ కృష్ణ,సంగీత,రాఘవన్ లు స్పాట్‌లో నే చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో యూసుఫ్‌గూడలో విషాద ఛాయలు అలముకున్నాయి.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

