ఓల్డ్ సిటీ నుంచి ప్రారంభించే దమ్ముందా?
హైద్రాబాద్‌లోని చింతల్ బస్తీలో హైడ్రా కూల్చివేతలపై అధికార పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు. హైడ్రా కూల్చివేతలు చేపట్టాలంటే తొలుత పాతబస్తీ నుంచి నిర్వహించాలని ఆ దమ్ము అధికారులకు ఉందా అని సూటిగా ప్రశ్నించారు.సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు వేచి చూడాలని అధికారులను విన్నవించినా పెడచెవిన పెట్టి తమకు సంబంధించిన కట్టడాలను అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ ఎలా కూల్చేస్తారని నిలదీశారు.అసలు కట్టడాలు అనేవి అక్రమమా,సక్రమమా అని నిగ్గుతేల్చేసే ప్రభుత్వానికి ఓల్డ్ సిటీ లో ఉన్న అక్రమ కట్టడాలెందుకు గుర్తుకురావడం లేదని నిగ్గదీశారు.ఇది ముమ్మాటికీ కుట్రపూరిత చర్యని మండిపడ్డారు.కానీ ఎక్కడా సీఎం పేరును మాత్రం అయన ప్రస్తావించకపోవడం గమనార్హం.