crimeHome Page SliderInternational

ప్రధానినే మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాను ఏఐ ఫోన్ కాల్‌తో సైబర్ నేరగాళ్లు బోల్తా కొట్టించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక నేత గొంతును అనుకరిస్తూ తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఆమె తెలియజేశారు. ఆ ఫోన్ మాట్లాడుతూ తాను ఎంతో ఆశ్చర్యానికి గురయ్యానని, మోసాన్ని వెంటనే గుర్తించగలిగానని పేర్కొన్నారు. ఏఐ ఎంత ప్రమాదకరమో గుర్తించి ఆందోళనకు లోనయ్యానని పేర్కొన్నారు. ఆ ఫోన్‌లో “ఎలా ఉన్నారు? మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను”. అని స్పష్టమైన గొంతుతో వాయిస్ వినిపించిందని తెలిపారు. కానీ ఏ నేత పేరుతో ఆ ఫోన్ వచ్చిందో తెలియజేయలేదు.