భార్య చెవులు కోసి ..
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్య చెవి కోసి అమ్మడానికి కమ్మలు తీసుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాయపల్లిలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు.భార్యతో డబ్బుల కోసం తరచూ గొడవ పడేవాడు.కూలీ నాలి చేసి వచ్చిన డబ్బులు కూడా భార్య దగ్గర బలవంతంగా తీసుకెళ్లే వాడు.అయితే గత కొంత కాలంగా భార్య ఇంటి వద్దే ఉంటుంది.దీంతో కుటుంబ పోషణ కూడా కష్టతరంగా మారింది.అయితే తాగుడుకు బానిసైన శ్రీనివాసులు ఈ నెల 17న మద్యం మత్తులో భార్య చెవిని కోసి కమ్మలు తీసుకెళ్లడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు నిందితుడిని అరెస్ట్ అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు పెద్దపప్పూరు మండల ఎస్సై నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.