బాసరలో భక్తుల రద్దీ
తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. అక్షయ తృతీయ సందర్భంగా భక్తుల తాకిడి నెలకొంది. బంగారు లక్ష్మీగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఘనంగా జరిగాయి.